యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సంవత్సరం సమ్మర్ లో ఈ మూవీని ప్రారంభించాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు.
ఇప్పుడు మార్చి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని.. దీనికి అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసారని.. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా నటించేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే.. విలన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను అనుకుంటున్నారట.
పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పొలిటిషన్ గా ఉపేంద్ర నటించనున్నారని తెలిసింది. ఉపేంద్ర గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ ఉపేంద్రను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ మూవీలో.. అది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో క్యారెక్టర్ అంటే ఉపేంద్ర నో చెప్పే ఛాన్స్ లేదు. మరి.. ఉపేంద్ర ఎస్ అంటారో నో చెబుతారో చూడాలి.
Must Read ;- టెన్షన్ లో త్రివిక్రమ్.. ఇంతకీ ఏమైంది.?