మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తారా అనుకుంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేసన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే.. అనుకోకుండా కరోనా రావడంతో అన్ని సినిమాల ప్లానింగ్ మారింది. ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అయితే తప్పా.. ఎన్టీఆర్ కొత్త సినిమాని స్టార్ట్ చేయలేడు.
దీంతో త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేయాలనుకున్నారు. మహేష్ బాబుతో చేద్దామనున్నారు. అలాగే రామ్ తో చేయాలి అనుకున్నారు. అయితే.. ఎన్టీఆర్.. మార్చి వరకు ఆగితే.. డేట్స్ ఇస్తానని చెప్పడంతో త్రివిక్రమ్ వేరే హీరోలతో సినిమా చేయాలనే ప్లాన్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికే ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ కి సంభాషణలు రాస్తున్నారు. అలాగే గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి కూడా డైలాగ్స్ రాస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఎప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తవుతుందా..? ఎన్టీఆర్ తో సినిమా చేద్దామాని త్రివిక్రమ్ ఎదురు చేస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చకచకా షూటింగ్ జరుగుతోంది. మార్చికి కంప్లీట్ అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయచ్చు అనుకున్నారు. అయితే… రామ్ చరణ్ కి కరోనా రావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కి బ్రేక్ పడింది. రామ్ చరణ్ కరోనా నుంచి బయటపడి షూటింగ్ కి రావడానికి ఇంచు మించు రెండు వారాలు అయినా పడుతుంది. ఈ లెక్కన ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అవ్వడం మరింత ఆలస్యం అవచ్చు. అందుకనే త్రివిక్రమ్ టెన్షన్ పడుతున్నారట. అదీ.. సంగతి..!
Must Read ;- భారీ, క్రేజీ మూవీ కోసం రంగంలోకి దిగనున్న త్రివిక్రమ్