సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘ఫైటర్’ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా పార్టనర్ గా ఉన్నారు. అయితే.. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఈ మూవీ తాజా షెడ్యూల్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు తాజా షెడ్యూల్ ఎప్పుడు అనేది అషియల్ గా ప్రకటించలేదు కానీ.. ఈ నెల 20 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ‘ఫైటర్’ మూవీ కోసం ముంబాయిలోనే సెట్ వేసి షూటింగ్ చేయాలి అనుకుంటున్నారట. సాధ్యమైనంత ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసి సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా ఇన్ని రోజులు ముంబాయిలోనే ఉన్న పూరి అండ్ ఛార్మి ఇటీవల హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఇంటిలో పూరి, ఛార్మికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారట. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. నిన్న పార్టీ అదిరిపోయింది. దేవరకొండ బెస్ట్ హోస్ట్ అని కూడా కితాబు ఇచ్చింది. అంతే కాకుండా.. విజయ్ దేవరకొండ తల్లి నాకు మంచి డాన్స్ పార్ట్నర్ అంటూ విజయ్ దేవరకొండ మదర్ తో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది ఛార్మి.
Must Read ;- విజయ్ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. !