రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించిన రేణుదేశాయ్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. అయితే.. గత కొన్ని రోజులుగా రేణుదేశాయ్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఓకే చెప్పిందని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఆ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కాగా, రెండోది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట.
లూసీఫర్ రీమేక్ లో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేయనుందని.. అలాగే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కి వదిన క్యారెక్టర్ చేయనుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమేనా..? లేక గాసిప్పా.? అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా రేణుదేశాయ్ చిట్ చాట్ లో ఓ నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నలకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని ఆమె బదులిచ్చారు.
ఈ రూమర్లు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో తెలియడం లేదు. అంతకు ముందు మేజర్ మూవీలో నటిస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు సర్కారు వారి పాట, లూసీఫర్ రీమేక్ అంటున్నారు. నిజంగా నటిస్తే మాత్రం తానే స్వయంగా ఇన్‌స్టాలో తెలియజేస్తానని తెలిపారు. సో.. సర్కారు వారి పాట, లూసీఫర్ రీమేక్ లో రేణుదేశాయ్ నటించడం లేదు అనేది వాస్తవం. మరి.. ఇక నుంచైనా రేణుదేశాయ్ కి సంబంధించి ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.
Must Read ;- ఘనంగా సింగర్ సునీత పెళ్లి.. వీడియో రిలీజ్ చేసిన రేణుదేశాయ్