‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు ఎనర్టిటిక్ హీరో రామ్. అదే సినిమాతో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ తదుపరి సినిమా ‘రెడ్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. తమిళ సూపర్ హిట్ మూవీ ‘తడం’ కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , సింగిల్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు రామ్ తొలి సారిగా ద్విపాత్రాభినయం చేయబోతుండడం కూడా ఈ సినిమాకి అడ్వాంటేజ్ కాబోతోంది.
ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 24న, సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాత రవికిశోర్ అనౌన్స్ చేశారు. హీరో రామ్ .. సంక్రాంతి బరిలోకి దిగనుండడం ఇది మూడోసారి. గతంలో దేవదాస్, మస్కా సినిమాలు సంక్రాంతికే విడుదలయ్యాయి. ఇప్పుడు ‘రెడ్’ తో రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
నివేదా పెతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటిస్తోన్న రెడ్ లో మరో ముఖ్యపాత్రలో నాజర్ నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి రెడ్ సినిమాకి సంగీతం అందించనుండడం విశేషంగా మారింది. మరి రెడ్ లోని రామ్ రెండు పాత్రలు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తాయో చూడాలి.
Must Read ;- దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్