ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాబోతుందని మోడీ ఇదివరకే ప్రకటించారు. దానికి సంబంధించిన సన్నాహాలు వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వకముందు నుంచే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్ ప్రక్రియను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా రెండు సార్లు డ్రై రన్ నిర్వహించి.. రాబోవు సవాళ్లను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఓ ప్రణాళికను సిద్దం చేసిన ప్రభుత్వం ‘వ్యాక్సినేషన్ పండుగ’ను ఈ నెల 16 నుంచి లాంచనంగా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రణాళిక, ఏర్పాట్ల గురించి చర్చించారు.
వారు నమోదు అవసరం లేదు
ముందుగా మొదటి దశలో భాగంగా 3 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు మోడీ మరోసారి స్పష్టం చేశారు. అందులో డాక్టర్లు, మెడికల్ సిబ్బందితోపాటు.. పోలీసులు, శానిటైజేషన్ సిబ్బంది.. ఇలా కరోనా నుండి ప్రజలను ముందుండి కాపాడిన వారిని చేర్చనున్నట్లు తెలిపారు. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దానికి సంబంధించిన డేటా రాష్ట్రాలు సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు డేటా రడీ చేసినట్టుగా తెల్పారు. ప్రజా ప్రతినిధులు ఫ్రంట్ లైన్ స్టాఫ్ జాబితాలో చేర్చకూడదని కూడా స్పష్టం చేశారు మోడీ.
Must Read ;- ప్రజలపై కరోనా సెస్సు .. ‘పన్ను’ పీకుతారట!
Interaction with Chief Ministers on COVID-19. https://t.co/lw3b6vQwRc
— Narendra Modi (@narendramodi) November 24, 2020
రెండు దశ వ్యాక్సినేషన్ నమోదు చేసుకున్నా వారికి చేయాలని నిర్ణయించారు. అందులో కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని మోడీ తెలియజేశారు. 50 ఏళ్లు పైబడిన వారికి ప్రధానంగా టీకా అందేలా చూడాలని తెలపారు. వయస్సుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా అందే విధంగా రాష్ట్రాలు డేటా సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక అందించాల్సిందిగా తెలిపారు.
ఇది సమాఖ్యవాదానికి నిదర్శనం
కేంద్రం, రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకుంటేనే ఈ కరోనా వ్యాక్సినేషన్ ఒక పండుగలా ఉంటుందని.. ప్రజలకు సకాలంలో అందించగలమని మోడీ చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్రాల సహకారం గొప్ప పరిణామంగా మోడీ అభివర్ణించారు. కొవ్యాక్సిన్, కొవిషల్డ్‌లతో పాటు మరో నాలుగు వ్యాక్సిన్లు ట్రయిల్స్ దశలో ఉన్నట్లు మోడీ తెలియజేశారు. మన దేశ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా.. కేంద్రం ఆమోదించిన వ్యాక్సిన్లు, విదేశీ వ్యాక్సిన్లకు ఏమాత్రం తీసిపోవని తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లోనే కనీసం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడం కేంద్రం లక్ష్యమని మోడీ చెప్పుకొచ్చారు. మొదటి దశ వ్యాక్సినేషన్ ఖర్చు మొత్తం కేంద్రం భరిస్తుందని మోడీ హామీ ఇచ్చారు.
కొవిషీల్డ్-కొవ్యాక్సిన్ పవరెంత?
ఈ టీకాలు వాడడం ద్వారా ఎన్నెళ్లు కరోనా నుంచి రక్షణ పొందచ్చు అనేది చాలా మందికి మెదులుతున్న ప్రశ్న. కొవిషీల్డ్ సంస్థ ప్రకటించిన ప్రకారం, నిర్ణీత సమయంలో రెండు డోసులు మిస్ కాకుండా తీసుకుంటే కొన్నేళ్ల పాటు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని చెప్తున్నారు. ఇక మన దేశీయ వ్యాక్సిన్ కొవ్యాక్సిన్ విషయానికొస్తే.. డిసిజిఐకి వారు అందించిన పరిశోధనా పత్రాల ప్రకారం టీకా వేయించుకున్న క్షణం నుండి 6 నెలల నుండి సంవత్సరం పాటు కరోనా నుండి రక్షణ లభిస్తుందని ధృవీకరించారు. సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తి కంటే వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ ఎన్నో రెట్టు మెరుగ్గా ఉంటాయని శాస్త్రవేత్తులు చెప్తున్నారు.
Also Read ;- టీకా వేయించుకున్న బ్రిటన్ రాణి ‘ఎలిజబెత్’