యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా రూపొందడం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడం తెలిసిందే. ఈ ఫ్యాక్షన్ మూవీ ఇచ్చిన విజయంతో మరో సినిమా చేయాలి అనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే సెట్స్ పై ఉండేది.
ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ మూవీకి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ తన సినిమాలకు అ తో స్టార్ట్ అయ్యేలా టైటిల్స్ పెడుతుంటారు. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అఆ, అల.. వైకుంఠపురములో.. ఇలా తన సినిమాల టైటిల్స్ అ అనే అక్షరంతో మొదలవుతుంటాయి.
వీటిలో అజ్ఞాతవాసి తప్పితే మిగిలిన సినిమాలన్నీ సక్సస్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయనున్న మూవీకి కూడా అతో స్టార్ట్ అయ్యేల అయిననూ పోయిరావలే అనుకుంటున్నారని గట్టి వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయనున్న మూవీకి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అవును.. ఈ మూవీకి ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టైటిల్ ఆసక్తిగా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా.? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- మరోసారి వార్తల్లో నిలిచిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ