స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ‘అల.. వైకుంఠపురుములో’ సినిమా తర్వాత బన్నీ వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ‘పుష్ప’ సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పట్టింది. అయితే.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బన్నీ.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాలతో మూవీని ఎనౌన్స్ చేశారు. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే… మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేయడానికి మధ్య కొరటాలకు చాలా గ్యాప్ వచ్చింది. అందుచేత అలాంటి గ్యాప్ ఇక నుంచి రాకుండా ఆచార్య పూర్తైన వెంటనే బన్నీతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఇదే విషయం గురించి బన్నీతో చెబితే.. 2021 మే నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం. ఈలోపు ‘పుష్ప’ సినిమా కంప్లీట్ చేస్తానని చెప్పారట. ‘ఆచార్య’ చాలా స్పీడుగా వర్క్ జరుగుతోంది. మార్చికి ‘ఆచార్య’ కంప్లీట్ అవుతుంది. ‘మే’లో ఆచార్య రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ‘పుష్ప’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే అయ్యింది. కరోనా వలన మారేడుమిల్లి షెడ్యూల్ బ్రేక్ పడింది. ప్రజెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. బన్నీ చెప్పినట్టుగా మేలోపు ‘పుష్ప’ కంప్లీట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. బన్నీ కొరటాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఫాస్ట్ గా వర్క్ చేసి.. షూటింగ్ కి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటే.. మేకి పుష్ప అతి కష్టం మీద కంప్లీట్ అవ్వచ్చు. ఒకవేళ అలా జరగకపోతే.. కొరటాల బన్నీ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Must Read ;- బన్నీ ఫాదర్ అయిన తర్వాత వచ్చిన మార్పు ఏంటో తెలుసా..?