వయసుతో పాటు గ్లామర్ పెరగడం .. ఆ గ్లామర్ కి ఫాలోయింగ్ పెరగడం .. ఆ గ్లామర్ తో క్రేజ్ ఉన్న కుర్ర హీరోయిన్లతో పోటీపడి యాడ్స్ లో మెరవడం చాలా అరుదైన విషయం. అలాంటి ఆశ్చర్యం తన విషయంలో అవలీలగా జరిగిపోయేలా చేసిన సుందరి మలైకా అరోరా. అందంతోను .. అదృష్టంతోను ఆమెకి ఏదో తెలియని బంధం ఉంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నా ఈ రెండూ ఆమెను వెంటపడుతూనే ఉన్నాయి .. విడిచిపెట్టేది లేదంటూ పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నాయి.

అందం .. అదృష్టం తన వెంట ఉండగా ఇక తనకి తిరుగులేదన్నట్టుగానే మలైకా వ్యవహరిస్తోంది. బీచ్ లు .. పార్కులు .. ఇసుక తెన్నెలు ఆమెకి విడిది కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రకృతిలోని అందమైన ప్రదేశాలు ఆమె ఎప్పుడు అడుగుపెడతాయా అని ఎదురుచూస్తున్నాయి. నీరు పల్లం వైపు ప్రవహించినట్టు, ఆమె అందం కూడా అందమైన లొకేషన్ల వైపే పరుగెడుతోంది. ఒకే ఒక్క ఫొటోని పోస్ట్ చేసి కుర్రాళ్ల చిట్టి గుండెల్లోని చీకాకులన్నీ ఎగరగొడుతోంది.
Must Read ;- వింటర్ లో సమ్మర్ టెంపరేచర్ రేపుతున్న మలైకా!

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. వైట్ అండ్ వైట్ ఇన్ వేర్ తో ఆమె ఇక్కడ కనిపిస్తోంది. పింక్ కలర్ మేనిఛాయతో మెరిసిపోతున్న ఆమె, వాలు కాళ్లను వాల్చేసి దోర మనసులను దోచేస్తోంది.అందాలను బంధించడం అందగత్తెల వల్ల కాదు .. చూపులకు సంకెళ్లు వేయడం కుర్రాళ్ల వలన కాదు అనే విషయాన్ని నిరూపిస్తోంది. ఈ ఫొటోను చూస్తూ ‘ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే .. ‘ అని పాడుకోకపోతేఅది కుర్రజాతికే అవమానమని వేరే చెప్పాలా?
Must Read ;- అందాలన్నీ తనలోనే దాగున్నాయంటున్న సొగసరి










