టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సొంత రాష్ట్రం పంజాయ్ అయినప్పటికీ.. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. శౌర్యం, ఈనాడు, గగనం, నాగవల్లి, నాయకి తదితర చిత్రాల్లో నటించింది. అయితే.. తన సినిమాల ద్వారా కన్నా.. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అనుబంధం ఉన్న కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే పూనమ్ ఇప్పుడు ఎన్టీఆర్, వై.ఎస్ ల పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
పూనమ్ ఎన్టీఆర్, వై.ఎస్ ల పై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఆయన ప్రస్తావన లేకుండా ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్, వై.ఎస్ తలపాగాతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి.. దానికి ఫార్మర్స్ మిస్ యూ అని కామెంట్ పెట్టింది. కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. అరవింద్ క్రేజీవాల్, ఆదిత్య యోగినాథ్, డాక్టర్ మనోహ్మాన్ సింగ్, అమరేందర్ సింగ్, రాజ్ నాథ్ సింగ్ పేర్లను ప్రస్తావిస్తూ.. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
రైతులు గత కొంతకాలంగా సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియచేస్తూనే ఉన్నారు కానీ.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. అందుకనే అనుకుంట పూనమ్ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Must Read ;- ‘ఇందిరమ్మ’ నుంచి నిధుల వరకు వైఎస్‌కు తోడుగా నిమ్మగడ్డ!











