అంతకు ముందు ఆతర్వాత, అమీ తుమీ, బందిపోటు, అ., అరవింద సమేత తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన తెలుగమ్మాయి ఈషా రెబ్బ. కథానాయికగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసి మెప్పించినా.. ఈ అమ్మడుకి ఆశించిన స్ధాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. అందుకనే అనుకుంటా… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనుకుందో ఏమో కానీ.. ఓ వైపు కథానాయికగా నటిస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో కూడా నటిస్తుంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో నటిస్తుంది. అలాగే లస్ట్ స్టోరీస్ రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతోన్న పిట్ట కథలు వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ నటిస్తుంది. ఈ పిట్ట కథలు తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ లో ఈషా చాలా హాట్ గా కనిపించనుంది. ఇదిలా ఉంటే.. ఈషాకు ఇప్పుడు లక్కీ ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా లక్కీ ఛాన్స్ అంటారా.? సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం.
ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ పిరియాడిక్ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ను ఈషా రెబ్బ దక్కించుకుందట. ఇంతకీ పాత్ర ఏంటంటే.. సమంత స్నేహితురాలి పాత్ర అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా ఈషా రెబ్బ ఫేట్ మారుతుందేమో చూడాలి.
Must Read ;- సమంత విలన్ గా మరో రకం హాట్ గురూ