క్షణం, అమీతుమీ, గూఢచారి, ఎవరు.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తుండడం విశేషం.

సోనీ పిక్చర్స్ సమర్పణలో ఈ మేజర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుండడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఫిల్మ్ మేకర్స్ వరుసగా భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేజర్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడంటే.. మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా మేజర్ చిత్రాన్ని జూలై 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉన్ని కృష్ణన్ గెటప్ లో ఉన్న శేష్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇది ఖచ్చితంగా శేష్ కెరీర్ లో మరిచిపోలేని సినిమాగా నిలుస్తుందని.. అలాగే మంచి విజయాన్ని కూడా అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు.
Must Read ;- చిరు బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ
2nd July 2021. The #MAJOR day 😊@adivisesh @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka #MajorOnJuly2 pic.twitter.com/iHSDCo80uy
— Mahesh Babu (@urstrulyMahesh) January 29, 2021











