శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలిప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించింది. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాని నిర్మించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టరే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం, యువ సమ్రాట్ నాగచైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని, సాయిధరమ్ తేజ్ తో చిత్రలహరి.. ఇలా వరుసగా సినిమాలు నిర్మిస్తోంది.
Also Read:-మహేష్ వెంకీ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందా.?
ఈ సంస్థ నిర్మించిన ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ నిర్మిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట నిర్మిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో భారీ చిత్రం నిర్మించే ప్లాన్ లో ఉంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయనున్నారు.
Also Read:-ఆచార్యకు నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిందా.?
నందమూరి నటసింహం బాలకృష్ణతో కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రానికి క్రాక్ తో సక్సస్ సాధించిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు నిర్మిస్తూ.. దూసుకెళుతోంది మైత్రీ మూవీ మేకర్స్.