నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2021 సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. సీనియర్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక బాలయ్య తదుపరి చిత్రం ఎవరితో అంటే.. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ పేరు వినిపిస్తుంది. బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా అంటే.. ఆ సినిమా హిట్టే అనే పేరుంది. అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ కోసం స్టార్ రైటర్స్ సాయిమాధవ్ బుర్రా, ఆకుల శివ కలిసి కథ రెడీ చేసారట. ఈ కథ విని బాలయ్య ఓకే చెప్పారని తెలిసింది.
మరో విషయం ఏంటంటే.. ఇందులో బాలయ్య పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే.. ఇందులో బాలయ్య గూడచారిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ సెట్ అయితే.. అభిమానులకు పండగే. బోయపాటితో చేస్తున్న సినిమా పూర్తైన తర్వాత బి.గోపాల్ తో సినిమాని ప్రకటిస్తారేమో చూడాలి.
Must Read;- బాలయ్యతో అనిల్ సినిమా .. నిజమేనా?