ముంబై 26 /11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆథారంగా తెరకెక్కుతోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘మేజర్’ . అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈసినిమాకి గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. జీయంబీ ఎంటర్ టైన్ మెంట్స్, సోనీ పిక్చర్స్ , ఏ ప్లస్ యస్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ మేజర్ మూవీ .. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతోంది. నేడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ.. మేకర్స్ .. ‘మేజర్’ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో మంటలు చుట్టు ముట్టిన ఒక భవనంలో ఒంటరిగా మేజర్ రివీలయ్యాడు. మేజర్ ..ఆర్ యూ దేర్ .. అనే వాకీ టాకీ వాయస్ వినిపిస్తుంది. ఇక ఆ వీడియోలోనే మేజర్ సినిమా టీజర్ ను మార్చ్ 29న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమా జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Must Read ;- ‘మేజర్’ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన గూఢచారి
Remembering our nation's unsung hero, Major Sandeep Unnikrishnan on his birth anniversary. 🙏
Here's a glimpse from #MajorTheFilm https://t.co/rQDWPFzlVL#MajorTeaserOnMarch28th#MajorGlimpse
— Mahesh Babu (@urstrulyMahesh) March 15, 2021