జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జాంబాగ్ డివిజన్‌లో సోమవారం పర్యటించారు. జాంబాగ్ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని అక్కడున్న బస్తీ వాసులను అడిగే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మహిళ వరద సాయంపై అసదుద్దీన్‌ను నిలదీసింది. తాము కష్ట కాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో మాకు ఓట్లు ఎలా అడుగుతావని ఆ మహిళ ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న ఎంఐఎం చీఫ్ ఆ మహిళా ఓటర్ ప్రశ్నకు సమాధానమివ్వకుండానే అక్కడి నుంచి జారుకున్నారు.
మొన్న హైదరాబాద్ నగరానికి వరదలు ముంచెత్తాయి. గతంలో ఎన్నడూ లేని వేధింగా హైదరాబాద్‌లోని చాలా కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర కష్టనష్టాలు పడ్డారు. వరద ఉధృతికి ప్రభావితమయిన ప్రాంతాల్లో ఓల్డ్‌సిటీ కూడా ఒకటి. ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సాయం చాలా మందికి అందలేదు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న పార్టీ నేతలను స్థానిక ప్రజలు వరదల విషయంలో నిలదీస్తున్నారు.
Must Read ;- ఎంఐఎం.. ముస్లింల పార్టీనా? రజాకార్ల పార్టీనా?