గతంలో కామెడీ చిత్రాలకు హీరోయిజాన్నిఆపాదించిన నటుడిగా రాజేంద్రప్రసాద్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ తర్వాత అల్లరి నరేష్ కూడా సంఖ్యాపరంగా అనేక కామెడీ చిత్రాలు చేసి పేరు తెచ్చుకున్నారు. నరేష్ తో సినిమా చేస్తే కమర్షియల్ గా మినిమిమ్ గ్యారంటీ అని నిర్మాతలు ఆలోచించేవారు. అయితే గత కొన్నేళ్లుగా నరేష్ కు విజయాలు లేకుండాపోయాయి. పైపెచ్చు ఓ వైపు పారితోషికాలు, మరోవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోయాయి. దాంతో గతంతో పోల్చుకుంటే నరేష్ కు సినిమాలు తగ్గాయి.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయన “బంగారు బుల్లోడు”, “నాంది” అనే రెండు చిత్రాలలో నటిస్తున్నారు. గిరి పాలిక దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న“’బంగారు బుల్లోడు” చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్న నరేష్ ఆ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. తనదైన కామెడీ మార్క్ తో ఈ చిత్రం ఉంటుందని నరేష్ అంటున్నారు. ఇందులో పూజా ఝవేరి హీరోయిన్ గా నటించింది. పలువురు పేరుపొందిన కమెడియన్స్ ఇందులో నటించారనీ, వారిపై తీసిన సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయని చిత్రబృందం వెల్లడించింది.
నిర్మాణానంతర పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని నూతన ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నరేష్, పూజా ఝవేరి మాస్ సాంగ్ లో డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది ఇదిలావుండగా..మరోవైపు అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ కథతో “నాంది” చిత్రం తెరకెక్కుతోంది.
Must Read ;- బూతులైతే నా షో చూడకండి.. చాగంటి వారి ప్రవచనాలు వినండి











