వినడానికి కాస్త ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించినా ఇదే నిజమండి! హైకోర్టు జస్టిస్ తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి కేసు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిచడం కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరుగుతుందేమో అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ కార్యలయాలకు రంగులు వేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో వాటిని తిరిగి తొలగించిన సంగతి కూడా తెలిసిందే. సుప్రీం కోర్టు సైతం రంగుల విషయంలో ప్రభుత్వ పిటిషన్‌కు కొట్టివేడంతో ప్రభుత్వానికి ఇక తప్పలేదు. వేరే మార్గం లేక పార్టీ మూడు రంగులపై తెల్ల రంగు వేయాల్సివచ్చింది. దీనికి అయిన ఖర్చెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్షరాల 4000 కోట్లు. ఇంత ప్రజా ధనాన్ని వృధా చేసినందుకు దానికి సంబంధించిన అధికారుల నుండి వసూలు చేయాలని డాక్టర్ మద్దపాటి శైలజ హైకోర్టును ఆశ్రయించారు.
మరో పిటిషన్ వేసే ప్రమాదముంది..
ఈ క్రమంలో తన బెంచ్‌కి వచ్చిన రంగుల ఖర్చు వసూలు కేసును జస్టిస్ రాకేశ్ కుమార్ తన రిటైర్మెంట్ (జనవరి) వరకు వాయిదా వేశారు. విచారణలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను తన ప్రతిష్ఠను కాపాడుకునే అవసరం ఉందని, ఇప్పటికే రెండు అంశాలలో తనపై ప్రభుత్వం విచారణ నుండి తప్పుకోవాల్సిందిగా పిటిషన్లు వేశారని, ఇప్పుడు ఈ అంశంలో విచారణ చేపడితే మళ్లీ ఇంకొక పిటిషన్ దాఖలు చేసే ప్రమాదమున్నందున వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
Must Reda ;- నాలుగో సింహానికి వైసీపీ రంగులు..!
వేటినీ వదలలేదు..
అది ఏదైనా.. పార్టీ రంగు పడాల్సిందే. చివరికి కరెంటు స్తంభాలను, చెత్త కుండీలను, శ్మశాన వాటికలను కూడా వదలలేదు. ప్రజాధనం కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుత్వానికి లోబడి ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్‌లు పర్యవేక్షణ ఇలాంటి పనులు జరగడాన్ని ఏమని వ్యాఖ్యానించాలో కూడా అర్థం కావడం లేదు. కోర్టు తీర్పులతో మళ్లీ తిరిగి తొలగించడానికి అదో ఖర్చు. అంతా కలిపి తడిసి మోపెడైంది.. 4000 కోట్లు దాటింది. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ రంగుల పిచ్చి ఇంకా వదలలేదు. తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా అది హద్దులు దాటి పోలీస్ బండికి కూడా అంటించారు.
విచారించాలన్నా భయపడుతున్నారు
జడ్జి వ్యాఖ్యలు వింటుంటే జగన్ గారి జమానాలో జడ్జి సైతం పరువు కాపాడుకోవాలంటే విచారణ నుండి తప్పుకోవాలి లేదా విచారణ వాయిదా వేసి విచారణకు మేము తగము అంటూ నమస్కారం పెట్టాల్సిందే. అలా చేయకపోతే ఇంకేముంది ఆ జడ్జి గారి పని పట్టడానికి న్యాయంలోని లొసుగులన్నీ వాడుతుంది ప్రభుత్వం. చివరికి వాళ్లిలా తమంతతామే తప్పుకునేలా చేస్తుంది. జస్టిస్ రాకేశ్ కుమార్ తన మాటలలో ఆంధ్రప్రదేశ్‌లో దుస్థితి ఎలా ఉందనేది దేశానికి కళ్లకు కట్టినట్టు చెప్పారు. న్యాయస్థానమే ప్రభుత్వం దెబ్బకు ఇలా చేతులెత్తేస్తుంటే.. సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమనే చెప్పాలి.
Also Read ;- ‘జగనన్న గుండెల్లో జనం ఎజెండా’ ఈ మాట రేటు 25 కోట్లు!