ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు నాలుగు వారాల పాటు నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ వన్ ప్రధాన పరీక్షాపత్రాల వాల్యూషన్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో ఎనిమిది పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. దీంతో రేపటి నుంచి జరగనున్న ఇంటర్వ్యూలను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు నిబంధనల మేరకు నిర్వహించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యూషన్ గురించి కూడా పరీక్షలకు ముందు తెలపలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు మీడియం పేపర్లు ఏపీలో, ఇంగ్లీషు మీడియం పేపర్లు ఇతర రాష్ట్రాల్లో వాల్యూషన్ జరిపించారని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రైవేటు వ్యక్తులతో ఎలా చేయిస్తారు
ప్రైవేటు వ్యక్తులతో గ్రూప్ వన్ జవాబు పత్రాలు వాల్యూషన్ చేయించారని, దీనిపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కనబెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవరించారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జవాబు పత్రాల వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. నిన్న ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఇంటర్వూలను నిలిపి వేస్తూ ఇవాళ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.
Must Read ;- ఏపీపీఎస్సీని అవినీతి మయం చేశారు : నారా లోకేష్











