స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. దీంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప ఫస్ట్ ఫార్ట్ 1 ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను, గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కోలీవుడ్ డైరెక్టర్ మురుగుదాస్.. ఇలా కొంత మంది దర్శకులు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు కథలు రెడీ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ చేయనున్న సినిమాల జాబితాను ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలియచేశారు. దీని ప్రకారం.. పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ మూవీ చేయనున్నారు. ఆతర్వాత పుష్ప పార్ట్ 2 ఉంటుంది. దీని తర్వాత మురుగుదాస్ తో సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను, కొరటాల శివతో సినిమాలు చేస్తారని చెప్పారు.
Must Read ;- ‘బాహుబలి, కే.జీ.ఎఫ్’ బాటలో బన్నీ ‘పుష్ప’?