స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు కదా.. మరి అంధుడిగా నటించనున్నాడు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ తో వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కథ రెడీ చేసి అల్లు అర్జున్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నారు.
ఐకాన్ టైటిల్.. కనుబడుట లేదు అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేయనున్నాడని ఇటీవల బన్నీ వాసు ప్రకటించారు. అయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడట. క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండడంతో ఓకే చెప్పాడని తెలిసింది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగాల చేయని అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలిసింది. మరి.. అల్లు అర్జున్ నమ్మకాన్ని వేణుశ్రీరామ్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
Must Read ;- ‘పుష్ప’ సెకండ్ పార్ట్ కోసం పవర్ ఫుల్ టైటిల్ లోడింగ్