Amazing Health Benefits Of Jamun Fruits :
- ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరమవుతాయి.
- అల్లనేరేడు చెట్టు ఆకులను ఇంటి ద్వారానికి తోరణాలుగా కడితే ఇంట్లోకి హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు రాకుండా ఉంటాయి. అల్లనేరేడు పండ్లు లివర్‌కు మేలు చేస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తూ చేరే తల వెంట్రుకలు, లోహపు ముక్కలను కూడా అల్లనేరేడు పండ్లు కరిగిస్తాయి.
- శరీరంపై కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లపై అల్లనేరేడు ఆకుల మిశ్రమాన్ని రాసి కట్టు కడితే త్వరగా గాయాలు తగ్గుతాయి. అల్లనేరేడు చెట్టు బెరడు లేదా పుల్లలతో దంతాలను తోముకుంటే దంత సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అల్ల నేరేడు గింజల చూర్ణంలో కొద్దిగా ఉప్పు కలిపి దాంతో దంతాలను తోముకోవచ్చు.
- నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభించడంతో వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు బయటకి పోతాయి. కాలేయ పని తీరుని మెరుగు పరచడంలో నేరేడు పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నేరేడులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. అంతే కాకుండా రక్త శుద్ధికి దోహదం చేసి గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
Must Read ;- నిమ్మ.. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది!