ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం ఇచ్చే ఆహార పదార్థాలు, జ్యూస్ లు, కూరగాయలు లాంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి నుంచి వచ్చే వాటిని తీసుకుంటూ.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది గోధుమ గడ్డి జ్యూస్ తాగేందుకు ఇష్టం చూపుతున్నారు. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉండటమే ఇందుకు కారణం.
ఫైబర్ అధికం
మన చుట్టూ ఉండే మొక్కలు, ధాన్యరాశుల్లో మనకే తెలియని ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. విటమిన్స్ పోషక పదార్ధాల కోసం మందుల్ని ఆశ్రయించడం కంటే మనకు దొరికే వాటితోనే అద్భుత ప్రయోజనం పొందవచ్చు. అందులో ఒకటి ఈ గోధుమ గడ్డి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణ సమస్య పోతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటివి తొలగిపోతాయి. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు. రోజూ తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా లభిస్తాయి.
పోషకాలు ఫుల్
కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్ల సమస్యతో బాధపడేవాళ్లు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. ప్రతిరోజు ఈ జ్యూస్ ను తాగడం వల్ల, ఈ సమస్యల నుంచి వెంటనే భయటపడొచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ
ఈ జ్యూస్ లో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తాగితే.. క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. మహిళలకు కూడా మేలు చేస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్లను తగ్గించి మూడ్ మారుస్తాయి.
ఎన్నో ఔషధ గుణాలు
ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే విదేశీయులు క్రమం తప్పకుండా గోధుమ గడ్డిని జ్యూస్ తాగుతారట. మనదేశంలో కన్నా ఇతర దేశాల్లో గోధమ గడ్డికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసమే అక్కడ టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి, గోధుమ గడ్డిని ప్రత్యేకంగా పండిస్తున్నారట.
Must Read ;- అల్లం టీతో.. ఎన్ని లాభాలో!