మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా హిట్స్ లేని రవితేజకి ఈ సినిమా సూపర్ సక్సెస్ చాలా రిలీఫ్ నిచ్చింది. దాంతో ఈ ఏడాది కూడా ఆ హవా కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ ‘ఖిలాడీ’ తో రాబోతున్నాడు. రమేశ్ వర్శ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రామిసింగ్ స్టోరీతో .మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది.
నిజానికి ‘ఖిలాడీ’ సినిమా ఈ నెల 28న విడుదల కావాలి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. మరో కొత్త డేట్ ను నిర్మాతలు అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా.. ఓటీటీలో విడుదల వుతుందని పుకార్లు వినిపించాయి. ఇటీవల నిర్మాతలు ఆ వార్తల్ని ఖండించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పారు.
అయితే ‘ఖిలాడీ’ థియేటర్స్ లో విడుదలైనా.. సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థకి విక్రయించారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వారు ‘ఖిలాడీ’ సినిమాకు ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. రవితేజ గత చిత్రం క్రాక్ ఆహాలో విడుదలై.. అక్కడ కూడా మంచి స్పందన దక్కించుకుంది. మరి ఈ సారి రవితేజ ఖిలాడీ ఏ రేంజ్ లో హిట్టయి.. అమెజాన్ ప్రైమ్ లో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Must Read ;- రవితేజ వెనక్కి తగ్గాడు మరి బాలయ్య ?