ఇది వరకే క్లియర్గా చెప్పాం!
‘ఢిల్లీ కోటను బద్ధలు కొడుతాం.. అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు’.. దేశ రాజకీయాలతో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. కేసీఆర్ స్టాండ్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలీన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, కర్నాటక విపక్షనేత, మాజీ ప్రధాని దేవెగౌడ్ వంటివి వారు స్పందించారు. సీఎం కేసీఆర్ కు పూర్తి మద్దతునిచ్చారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. సీఎం ఉద్ధవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ లను విడివిడిగా కలిసి, ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ చర్చించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ పర్యటన అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని మమతకు ముందే చెప్పాం అని ఎంపీ వెల్లడించారు.
మేము ఎప్పుడూ చెప్పలేదే!
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంటే.. కాంగ్రెస్ కు కొత్తకూటమి చోటు ఉండాల్సిందేనని ఎంపీ సంజయ్ తేల్చి చెప్పారు. కేసీఆర్ – ఉద్ధవ్ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్ కూటమి అనే మాట రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లేకుండా కూటిమిలో చేరే ప్రసక్తే లేదని, ఈ విషయం పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు కూడా చెప్పామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను కూడా కలుపుకుని పోతేనే, తమ మద్దతు ఫ్రంట్ కు ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ అన్నిపార్టీలను కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఉందని ఆయన చెప్పకొచ్చారు. మరో వైపు కూటమి ప్రయత్నాలు ఫలించబోవని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నావీస్ విమర్శించారు. బీజేపీని ఢీకొనేందుకు 2019 ఎన్నికల ముందూ ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలయయ్యారని గుర్తు చేశారు.
Must Read:-పవర్లో ఉన్నోళ్లకే దండిగా ఫండ్స్.. అక్కడ బీజేపీ,ఇక్కడ టీఆర్ఎస్











