బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి.. అనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న నటి అనసూయ. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, కథనం, విన్నర్.. తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే.. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వలో రూపొందిన సంచలన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. ఈ పాత్ర అనసూయ కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పచ్చు. ఈ సినిమా తర్వాత నుంచి అనసూయకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళ చిత్రాల్లోకూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా. జీఎ2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ప్రచారంలో ఉన్న వార్తల పై స్పందించింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. తాను ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇంకా ఏం చెప్పారంటే.. చావు కబురు చల్లగా సినిమాలోని స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన ఫ్రెండ్ జానీ మాస్టర్ చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తుండడంతో ఆ సాంగ్ చేయడానికి ఆసక్తి చూపిన మాట వాస్తవమే. అయితే.. స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఇంట్రస్ట్ లేదు. వెండితెర పై ఎప్పటికీ నిలిచేపోయేలా.. అద్భుతమైన పాత్రలను పోషించాలనుకుంటున్నాను. అదే నా కల అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు. మరి.. అనసూయ కోరుకున్నట్టుగానే భవిష్యత్ లో మరిన్ని అద్భుతమైన పాత్రలతో అలరిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- అనసూయ వేశ్య పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతి