ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ‘మా తెలుగు తల్లి’ గీతాలాపన తరువాత జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ మాట్లాడుతూ.. ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పొట్టి శ్రీ రాములతో పాటు ఇతర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. వారందరిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితా భావం, నిబద్ధతతో ముందుకెళాదాం అని సీఎం పేర్కొన్నారు.










