ఉపాధి అడిగితే అరెస్ట్లా?
విజయనగరం జిల్లా బొబ్బిలిలోనిమి మైథాన్ పారిశ్రాక వాడలో ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ.. స్థానికులు రోడ్డెక్కారు. నిరసన చేపట్టి.. విధానాలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవాడలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపాధి కావాలిని అడిగితే అరెస్ట్ చేయాలని చూడటం ఎంతమేరకు సబబుకాదని స్థానికులు వాదిస్తున్నా.. చేస్తున్న నిరసనలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసే ప్రయత్నించగా.. ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది.
పోలీసు చర్యలను ప్రతిఘటించిన మహిళలు..
బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్ పరిశ్రమ వద్ద సమీప గ్రామాల ప్రజలు తమకు ఉపాధి చూపాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు చేస్తున్న ఆందోళనను భగ్నం చేసేందుకు యత్నించి పోలీసులకు మహిళలు గట్టి సమాధానం చెప్పారు. ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థతి నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాత కలిగిస్తున్నారంటూ.. వారిని ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనాల్లో వెళ్లేందుకు వారు నిరాకరించారు. అంతేకాక ఓ దశలో పోలీసులను ప్రతిఘటించి, వారిపై ఇసుక, మట్టి చల్లారు. అయినా పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పారిశ్రామివాడలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు!
Mst Read:-‘చలో విజయవాడ’ కు నో పర్మిషన్ .. అడుగు బయట పెడితే అరెస్ట్ లేనా?!











