అప్పు కోసం కేంద్రం వద్ద సాష్టాంగం !
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, పథకాలు అమలు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని జగన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని వేడుకుంటోంది. ఈ నెల రూ.16 వేల కోట్లు అప్పు ఇప్పించండి ఆర్థిక మంత్రి బుగ్గన వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో కూడా అప్పుకోసం ఢిల్లీకి మంత్రి బుగ్గన, ఆర్థిక కార్యదర్శి ప్రదక్షణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాదేయపడం చూడలేక సెప్టెంబర్ 3 న రూ.10,500 కోట్లు కొత్త అప్పునకు అనుమతించింది. దీంతోపాటు మూలధనం వ్యయ లక్ష్యం చేరుకున్నందుకు మరో రూ. 2,650 కోట్లును కూడా కేంద్రం ప్రోత్సాహకంగా అప్పుకు కూడా అనుమతించింది. అలానే రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ కు బ్యాంకులకు కుదిరిన రూ. 25,000 కోట్ల అప్పులో భాగంగా మిగిలిన 3,500 కోట్లను గడిచిన రెండునెలల్లో వాడేశారు. ఇప్పుడు రాష్ట్రం వద్ద ఉంది కేవలం రూ. 1150 కోట్ల అప్పు మరిమితి మిగిలింది. దీంతో వచ్చే నెల ఉద్యోగుల జీతాలు, పథకాల అమలుకు అప్పుకు వెళ్లాల్సిన పరిస్థితి. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే పలుమార్లు మంత్రి బుగ్గన, మాజీ సీఎస్, ఆర్థిక కార్యదర్శి లు ఢిల్లీ గల్లీల్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే శుక్రవారం కేంద్ర తాజాగా 7 రాష్ట్రాలకు అప్పుకు అనుమతించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం లేకపోవడానికి గల కారణం కేంద్ర నిర్ధేశించిన మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవ్వడమేనని తెలుస్తోంది.
కేంద్ర లక్ష్యాలను అలక్ష్యం చేసిన ఫలితం!
కేంద్రం నిర్ధేశించిన మూలధన వ్యయ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం అలక్ష్యం వహించిందన్న కారణంగానే కొత్త అప్పులకు పరిమితులను విధిస్తోంది. దీని మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం రుణ పరపతిని కోల్పోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి మూలధన వ్యయ లక్ష్యాలను తెలంగాణ, చత్తీస్గడ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు అధిగమించాయి. బహిరంగ విపణీలో అదనపు రుణాలు తెచ్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ( వ్యయ విభాగం ) ఆయా రాష్ట్రాలకు రుణ అనుమతినిచ్చింది. ఏపీకి 2020-21 లో రకూ.27,000 కోట్ల మూల ధన వ్యయం చేయాలని కేంద్రం నిర్దేశించింది. దీని ప్రకారం సెప్టెంబరు 30 నాటికి 45 శాతం, డిసెంబరు 31 నాటికి 70శాతం, మార్చి 31 నాటికి 100 శాతం మూల ధన వ్యయం చేయాలని కేంద్రం సూచించింది. ఈ షరతులను ఏపీ ఫాలో కాలేదని కేంద్ర వ్యయ విభాగం ఆరోపిస్తుంది. ఈ కారణాలతోనే అదనపు అప్పులకు కేంద్రం అనుమతివ్వడంలేదు. ఇప్పటి వరకు ఏపీ రూ. 8 వేల కోట్ల మాత్రమే మూలధన వ్యయం చేసింది. రూ.13 వేల మూలధన వ్యయం చేస్తే ఎంత అదనపు అప్పు లభిస్తోందో అంత పరిమితిని కేంద్రం ముందుగానే ఇచ్చేసింది. ఈ ఫిగర్ ను మార్చి 31 నాటికి కూడా రూ.13 వేల కోట్ల మూలధన వ్యయం ఏపీ చేయకపోతే .. అదనంగా ఇచ్చిన అప్పులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే అప్పుల పరిమితిలో కోత విధిస్తోంది అన్నది వాస్తవం. భవిష్యత్తు రుణ పరిమితిని కూడా తాకట్టుపెట్టి మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Must Read ;- ‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!










