పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ హౌస్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ క్రేజీ మూవీని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ మూవీ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో మరింత ఆతృత పెరిగింది. ఎప్పుడెప్పుడు భీమ్లా నాయక్ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. సంక్రాంతికి ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిల ఆర్ఆర్ఆర్ వస్తుంది. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ వస్తుంది. నాగార్జున బంగార్రాజు కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. అందుచేత భీమ్లా నాయక్ ఆలోచనలోపడ్డాడని.. సంక్రాంతికి రావడం లేదని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారీ.. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ భీమ్లా నాయక్ సంక్రాంతికి రావడం పక్కా అంటూ అనౌన్స్ చేస్తుంది.
ఇలా.. ఓ వైపు అఫిషియల్ గా భీమ్లా నాయక్ గురించి ప్రకటించినప్పటికీ.. మరో వైపు భీమ్లా నాయక్ వాయిదా అనేది గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమా ఫిబ్రవరి నెలకి షిఫ్ట్ అయ్యిందట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. దీంతో భీమ్లా నాయక్ రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై భీమ్లా నాయక్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- భీమ్లా నాయక్.. ఆల్ టైమ్ రికార్డ్











