ఏపీలో కరోనా కట్టడిలో భాగంగా విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం జూన్ పది వరకు పొడిగించింది.కరోనా కేసులు పెరుగుదల తగ్గినా ఇంకా వేలల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.గడచిన వారం రోజుల్లో 98 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఏపీలో లక్షా 92 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు ఉండటం,ప్రతి రోజూ కొత్తగా 13 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో,ఏపీలో మరో పది రోజులు కర్ఫ్యూను పొడగించారు.పది రోజుల తరవాత ఏపీలో ఉన్నయాక్టివ్ కేసులు,రోజు వారి నమోదవుతున్న కేసులను సమీక్షించి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నారు.
సడలింపు వేళలు యథాతధం
కర్ఫ్యూ వేళల సడలింపులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కర్ఫ్యూను జూన్ పది వరకు పొడిగించారు.కర్ఫ్యూ సడలింపు వేళలను మాత్రం మార్చలేదు.ఇక టీకాలు కూడా పెద్ద ఎత్తున వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న టీకాలను ఎప్పటి కప్పుడు పూర్తి చేయాలని నిర్ణయించారు.
Must Read ;- కరోనా వైరస్ చైనా సృష్టించిందే.. పరిశోధనాత్మక విశ్లేషణ











