Are Increase In Corona Cases Sign For Corona Third Wave ? :
ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో మళ్లీ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెల్టా ప్లస్ వైరస్‌తో థర్డ్ వేవ్ మొదలయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న కొత్తగా 45,892 మందికి కరోనా సోనినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో దేశంలో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. నిన్న మరో 817 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 4,05,028కి చేరింది. నిన్న 18,93,800 మంది నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 45,892కి పాజిటివ్‌గా తేలింది.
రికవరీ కంటే కొత్త కేసులే ఎక్కువ
గత 55 రోజులుగా కరోనా రెండో దశలో కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. కాని తాజాగా 44 వేల మంది కోలుకోగా, 45 వేలపైన కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో థర్డ్ వేవ్ మొదలయ్యిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. దేశంలో 4.6 లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తంగా 36.48 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ అయ్యింది.
ఏపీలో 3,166 కొత్త కేసులు
కాగా, ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది మృతి చెందగా 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.
తెలంగాణలో తగ్గు ముఖం
తెలంగాణలో గత వారం రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 772 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు వ్యాధి బారిన పడి మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 748 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో వైరస్ బారిని పడి ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారు.
Must Read ;- డెల్టాపై.. కోవాగ్జిన్ భేష్!