లేడీస్ ఫస్ట్ అన్నట్లుగానే ఎన్సీబీ అధికారులు ముందు డ్రగ్స్ కేసులో హీరోయిన్లను విచారించారు. ఇప్పుడు హీరోల వంతు వచ్చినట్లుంది. మనకు తెలుస్తున్న సమాచారం ఏమిటంటే మరో రెండు మూడు రోజుల్లో చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందులో తెలుగు హీరోలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నలుగురు హీరోయిన్లను విచారించారు. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఉన్న ఛాటింగ్ ను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్సీబీ విచారించినపుడు ఆ హీరోయిన్లు కొందరు హీరోల పేర్లను కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఆ నలుగురిలో తెలుగు హీరోలు కూడా ఉన్నట్లు వార్తలందుతున్నాయి. వారు ఎవరై ఉంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ హీరోలందరికీ రేపు లేదా ఎల్లుండి సమన్లు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక, సారా, శ్రద్ధ, రకుల్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎన్సీబీ తొలి జాబితాలో బాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ హీరోలు ఎవరు, తెలుగు హీరోలు ఎవరు అన్నది తేలాల్సి ఉంది. రేపటికల్లా దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











