మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సంక్రాతి సందడికి ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్టే. దీనికి కారణం నిర్మాత ఠాగూర్ మధు ఇంతకుముందు సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలే కారణమని తెలిసింది. గతంలో విశాల్ హీరోగా తమిళంలో రూపొందిన ‘అయోగ్య’ సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఠాగూర్ మధుకు తమిళ నిర్మాతతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
ఇదే సినిమాని తెలుగులో ‘అయోగ్య’ పేరుతో విడుదల చేశారు కూడా. దానికి సంబంధించి కొంత సొమ్మును మధు వారికి చెల్లించాల్సి ఉంది. అది క్లియర్ చేసిన తర్వాతే క్రాక్ సినిమా విడుదల చేయాలని ఆ నిర్మాత పట్టుబట్టినట్టు తెలిసింది. ‘క్రాక్’ విడుదల కాకుండా వారు కోర్టు నుంచి స్టే తెచ్చినట్టు సమాచారం. అందువల్లే ఈ సినిమా ఈరోజు విడుదల కాలేదు. ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఆన్ని ఆటలూ రద్దయ్యాయి.
ప్రస్తుతం తమిళ నిర్మాతతో చర్చలు నడుస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమా విషయంలో ఇంత గందరగోళం ఏర్పడటంతో సినిమా పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. బుక్ మై షో వెబ్ సైట్ నుంచి కూడా ‘క్రాక్’ తీసేశారు. ఈ నిలుపుదలపై త్వరలోనే స్పష్టత రావచ్చు. హీరో రవితేజ అభిమానులకు మాత్రం ఇది షాక్ కలిగించే అంశం.
Must Read ;- ఫైనాన్స్ రచ్చేనా : రవితేజ క్రాక్.. రిలీజ్‌కు బ్రేక్!











