మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు విశేష స్పందన లభించడంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది.
గత సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సివుంది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ.. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ కాబట్టి థియేటర్లోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు. డిసెంబర్ నుంచి థియేటర్లు ఓపెన్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఎప్పుడు ఉప్పెన రిలీజ్ చేస్తారని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్టు నిర్ణయించినట్టు తెలియచేస్తూ.. అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటన, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్, ఆకట్టుకునే సంభాషణలు ప్రతీ ఒక్కటి సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచడంలో కీ రోల్ పోషించాయి అని చెప్పచ్చు. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా నటించడం విశేషం. టీమ్ అంతా సినిమా సక్సస్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. వైష్ణవ్ తేజ్ తొలి ప్రయత్నంగా వస్తున్న ఉప్పెనతో ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
Must Read ;- రెండు ప్రాజెక్టులు ఓకే చేసిన మెగా డెబ్యూ హీరో..!
The Love Wave will hit the theatres on February 12th 🌊#Uppena ❤️#PanjaVaisshnavTej @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @NavinNooli @SukumarWritings @adityamusic #UppenaOnFeb12th pic.twitter.com/oneJ5oIB8W
— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2021