మెడరన్ జ్యోతిష్యంలో అసలు నిజలు ..!
త్రిదళాధిపతి బిపిన్ రావత్ మరో ఏడాదిలో మరణిస్తారని ఏడాది క్రితమే చెప్పారు బెంగుళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్కురాలు గాయాత్రిదేవి! ఈ ఏడాది చివరలో రెండు ఘోర ప్రమాదాలు సంభవిస్తాయని లిఖిత పూర్వకంగా హెచ్చరిచారు గాయాత్రీ వాసుదేవ్. ఇది ఎంత వరకు నిజం! ఇదంతా మూఢ నమ్మకమని కొట్టిపారేయలా? అలానే అయితే బిపిన్ మరణించడం తధ్యమని ఎలా చెప్పారు? ఇవే కాదు .. గుజరాత్ భూకంపం, ఎల్టీటీఈ ప్రభాకరన్ అసాసినేషన్, సునామీ వంది ఉపద్రవాలను ముందుగానే గాయత్రీ వాసుదేవ్ ముందుగానే చెప్పి హెచ్చరించారు. కీలంగా డిసెంబర్ 14న మరో ఊహించని హోరం జరగబోతుందని కూడా హెచ్చరించారు. ఇప్పడు ఇదే అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చాపర్ క్రాష్ లో బిపిన్ దుర్మరణంపై హెచ్చరించిన గాయత్రీ..!
తమిళనాడులోని సుళ్లూరు – కూనూర్ మధ్య సైనిక హెలికాప్టర్ కుప్పకూలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాన్ని ఏడాది క్రితమే ప్రముఖ బెంగుళూరు జ్యోతిష్కురాలు గాయత్రీ వాసుదేవ్ చెప్పారు. తన ఆస్ట్రాలజీ మేగజైన్ కూడా దీనిపై ఒక వ్యాసం కూడా రాశారు. పేరు చెప్పకుండానే ఆర్మీ ఉన్నతాధికారి హఠాన్మరణానికి గురువుతారని జ్యోతిష్కురాలు గాయాత్రీ వాసుదేవ్ హెచ్చరించిన అంశాలే.. ఇవే నేడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్స్ గా మారాయి. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 4 నుంచి 14 వరకు రెండు ఘోర ప్రమాదాలు సంభవిస్తాయని అందులో ఆర్మీ ఉన్నతాధికారులు, హైప్రోఫైల్ కేటగిరికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు కన్నుమూస్తారని అంచన వేశారు గాయత్రీ వాసుదేవ్. అంతేకాక దేశంలో హింసాత్మక ఘటనలు, నేరాలు చోటు చేసుకుంటాయని ఆమె చెప్పారు. ప్రధాని మోదీతోపాటు కెబినెట్ మంత్రలు సెక్యూరిటీని కూడా మరింత పెంచాలని గాయత్రీ హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ మోదీ జాతకాన్ని కంపెర్ చేస్తూ .. దేశంలో జరగబోయే విపత్తులను, ప్రమాదాలను ఆమె అంచన వేసతున్నట్లు తన మెడరన్ ఆస్ట్రాలజీలో చెప్పుకొచ్చారు. అలానే డిసెంబర్ 14 గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కుజగ్రహం – రాహువు పరస్పరం సంమోగం చెందుతాయని,ఇవి ఎంతమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దీనిద్వారా అవాంఛనీయ సంఘటనలు,హింసాత్మక పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయన్నది గాయత్రీ వాసుదేవ్ వాదనల్లోని కీలక అంశాలు. ఏదీఏమైన సనాతన సిద్ధాంతాలు, సంస్కృతుల అనేవి సైన్స్ కు మూడిపడి ఉన్నాయన్నది వాస్తవం!
Must Read ;- దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!











