Changes In Karnataka Politics Modi Dev Gowda Meet
పొత్తుల ద్వారా కన్నడలో కమల వికాసం జరిగేనా?
కర్నాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. కాకుంటే కన్నడ గడ్డపై రాజకీయ సంక్షోభం అనివార్యంగా కనిపిస్తోంది. అధికారపార్టీ బీజేపీలో మూడు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. చాలా బలంగా ప్రతిపక్ష కాంగ్రెస్ అక్కడ అవకాశం చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, జెడీఎస్ కూటమి నుంచి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాజీనామ తరవాత పాలన పగ్గాలను బీజేపీ అందుకుంది. ముందు యడ్యూరప్ప, ఆ తరువాత బస్వారాజ్ బొమ్మై లు ముఖ్యమంత్రులు ఆశీనులైనా… బీజేపీ కేడర్ ను సమ తాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారు. గ్రూప్ రాజకీయాలు సలపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ .. పాలనను గాలికొదిలేశారు అన్న అపవాదు కాషాయ పార్టీపై లేకపోలేదు. అయితే ఈ సారైనా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను కౌవసం చేసుకుని సంపూర్ణం మెజారిటీ కర్నాటక సీఎం పీఠాన్ని అధిరోహించాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా మూడు స్థానంలో ఉన్న జేడీఎస్ కు దెగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Changes In Karnataka Politics Modi Dev Gowda Meet
శీతాకాలంలో రాజకీయ వేడి రేపుతున్న ఉద్దండుల భేటీ!
ఒకపక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దేవగౌడ కుమారుడు కుమారస్వామిని గద్దెదించి సీఎం కుర్చిన తన్నుకుపోయింది బీజేపీనే. ఒకవిధంగా రాజకీయ శత్రువుగా భావించే బీజేపీతో జేడీఎస్ అధినేత దేవగౌడ భేటీ అవ్వడంపై ఏంటీ? అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్ర ఆశక్తిని రేపుతోంది. ప్రస్తుతం సీఎం బొమ్మై ను దించి మురుగేష్ నిరాని సీఎం చేయాలని డిమాండ్స్ బాగా వినిపిస్తున్న వేళా.. ఇరువురు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నుంచి జేడీఎస్ ను దూరం చేసి .. తనవైపు తిప్పుకుని 2023 లో కలిసి పోటీ చేయాలని బీజేపీ చూస్తోందా? లేక సొంతపార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తులను అధిగమించడానికి ప్లాన్ – బి ని అమలు చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారా? అన్నది తెలిసిరావాల్సి ఉంది.
Must Read ;- కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!











