భీష్మ ఏకాదశికి నందమూరి బాలకృష్ణ తన కానుకను విడుదల చేశారు. భీష్మ వేషంలో బాలయ్య స్టిల్ ఎలా ఉంటుందో చూడండి. ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన భీష్మలో ఎన్టీఆర్-భీష్మ గెటప్ ఎలా ఉంటుందో అలాంటి గెటప్ లో బాలకృష్ణ ఈ స్టిల్ ను విడుదల చేశారు. దీనిపై బాలయ్య మాట్లాడుతూ భీష్మ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అందుకోసమనే ఎన్టీఆర్-భీష్మ లో నటించిన కొన్ని సన్నివేశాలను ఎంపిక చేశారట.
ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ కోసం బాలయ్యపై కొన్ని సన్నివేశాలను ఈ వేషంలో చిత్రీకరించారట. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడం వల్ల సినిమాలో ఈ సన్నివేశాలు లేవు. ఈరోజు భీష్మ ఏకాదశి కావడంతో ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను మీడియాకు విడుదల చేశారు. ఈ పాత్ర మీద తనకున్న మక్కువను అభిమానులతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఫొటోలను విడుదల చేస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ ఈ గెటప్ తో ఉన్న సన్నివేశాలను కూడా ‘నర్తనశాల’ మాదిరిగా విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.
Must Read ;- ఎన్టీఆర్, బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడయ్యా?