టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ లోకి శనివారం నాడు బాలయ్య బాబు కూడా అడుగుపెట్టారు. ఆయన పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కథ పరంగా ఈ సినిమాలో ఒక యువ ఎమ్మెల్యే పాత్ర ఒకటి ఉందని, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను ఒక ప్రముఖ హీరో నటిస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
Also Read:-నటసింహ సరసన అఖిల్ హీరోయిన్
ఆ యువ ఎమ్మెల్యే పాత్రలో నారా రోహిత్ మెరవనున్నాడని సమాచారం. ఈ పాత్రకు ముందు తారకరత్నను తీసుకుందామని బోయపాటి ఆలోచించాడంట. కాని ఫైనల్ గా నారా రోహిత్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథలో ఎమ్మెల్యే పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అని అందుకనే దర్శకుడు నారా రోహిత్ ను తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే బోయపాటి ఎమ్మెల్యే పాత్ర కోసం నారా రోహిత్ ను సంప్రదించాడని, రోహిత్ కి కూడా కథలోని తన పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఇప్పటికే నారా రోహిత్ కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక సినిమాలో నారా రోహిత్ కూడా తోడయితే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. దర్శకుడు బోయపాటి తీసిన గత చిత్రం పరాజయం చెందడంతో ఈ సినిమాను ఎలాగైనా పెద్ద హిట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకనే కొత్త కొత్త కాంబినేషన్స్ ను ట్రై చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాకి నారారోహిత్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
Also Read:-బాలకృష్ణతో తలపడే విలన్ గా రాజశేఖర్?