అందం, అభినయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. కథానాయికగా అగ్రస్థానంలో కొన సాగడం నయనతారకు మాత్రమే చెల్లింది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. మిగతా కథానాయికలకు పోటీగా మారిన అమ్మడి తాజా చిత్రం ‘నెట్రికణ్’. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ సినిమాకి ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకుడు. అతి త్వరలో సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో అంధురాలిగా నటిస్తున్న నయనతార పోలీసాఫీసర్ కూడా అవడం మరో విశేషం. ఒక సైకో కిల్లర్ ను వేటాడే ఒక అంధ పోలీసాఫీసర్ గా నయతార అభినయం అద్భుతం అని టీజర్ ను బట్టే అర్ధమవుతోంది. ‘నానుమ్ రౌడీ దానే’ అనే మూవీలో మూగ, బధిర పాత్రను అద్భుతంగా పోషించిన నయన్.. ఇప్పుడు అంధురాలిగా నటిస్తూండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ‘నెట్రికణ్’ సినిమా నయనతారకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- షాకింగ్ లుక్ లో సౌత్ లేడీ సూపర్ స్టార్