రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నా పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రం లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా సీతా దేవిగా అందాల కృతి సనన్, సన్నీసింగ్ లక్ష్మణుడుగానూ నటిస్తుండగా.. లంకేష్ రావణుని పాత్రను బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టి.. కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న దర్శకుడు.. ఈ సినిమాకోసం తానాజీ టెక్నిక్స్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది.
ఓం రౌత్ ఇంతకు ముందు అజయ్ దేవ్ గణ్ హీరోగా ‘తానాజీ’ అనే చారిత్రక చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. మరాఠా వీరుడు తానాజీ మాలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ను ఓం రౌత్ కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ను ఉపయోగించాడు. ముఖ్యంగా వార్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే అదే టీమ్ తో అదే రీతిలో అద్భుతమైన విజువల్ వండర్ గా ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించాడానికి సిద్ధమవుతున్నాడు… ఆ సినిమా కన్నా ఆదిపురుష్ బడ్జెట్ చాలా ఎక్కువ కాబట్టి.. ఈ సారి మరింత బాగా ఇందులో విజువల్ వండర్స్ ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు. ఆదిపురుష్ అమేజింగ్ అవుట్ పుట్ తో ఉంటుందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.
Must Read ;- ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనట!