వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని కొల్లగొడుతుందని, చివరకు ఇసుకను కూడా బీనామీ సంస్థకు కట్టపెడుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇసుక ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇసుకను కిలోల లెక్కన తూకం వేస్తూ వినూత్న నిరసన తెలిపారు. వెంటనే ఇసుక టెండర్లను రద్దు చేయాలని రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు, నాయకులు ఆదినారాయణ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రజాధనాన్ని ప్రైవేట్ పరం చేస్తుందని అన్నారు.
Must Read ;- జనసేన కటీఫేనా.. తిరుపతిలో బీజేపీ ఒంటరి పోరేనా











