గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తరువాత మిగతా ఓట్లను లెక్కిస్తారు. కొన్ని చోట్ల ఇంకా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మొదటి ఫలితం మెహిదీపట్నంకు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. చాలా డివిజన్లలో 28వేల ఓట్ల వరకే నమోదయ్యాయి. మెహిదీపట్నంలో 11 వేలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. మెజార్టీ డివిజన్ల ఫలితాలు దాదాపు మధ్యాహ్నంలోపు వరకు రానున్నాయి. గ్రేటర్ మేయర్ పీఠం ఎవరనేది మధ్యాహ్నంలోపు తెలిసే అవకాశం ఉంది. రెండో రౌండ్‌లోనే 136 డివిజన్ల ఫలితాలు వస్తాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. కొన్ని చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. 150 డివిజన్లలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1296 ఉన్నాయి. చంపాపేటలో టీఆర్ఎస్ 2, బీజేపీ 5, కాంగ్రెస్‌కు ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు వచ్చింది. లింగోజి గూడలో టీఆర్ఎస్ 1, బీజేపీ 5, కాంగ్రెస్ 3, ఇతరులకు 1 ఓటు వచ్చాయి. హస్తీనాపురంలో బీజేపీ 4, కాంగ్రెస్1, చెల్లనివి 3. జీడిమెట్లలో బీజేపీ 6, టీఆర్ఎస్ 4 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇలా మరికొన్ని చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్‌లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Must Read ;- నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన











