దేవుడు వరం ఇచ్చినా, పూజారి వరం ఇవ్వలేదని నానుడి . ప్రస్తుతం థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి అలాగే ఉంది . గత నెల తమిళ సినిమా ” మాస్టర్ ” విషయానికి వస్తే , చిత్ర హీరో విజయ్ స్వయానా తమిళనాడు రాష్ట్ర ముఖ్య మంత్రి ని కలిసి , థియేటర్స్ లో నూరు శాతం ప్రేక్షకులు రావడానికి అనుమతి ఇవ్వలిసిందిగా కోరారు. తమిళనాడు ప్రభుత్వం అందుకు అనుమతిని ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ససేమీరా అంది.
ఇప్పుడు ఫిబ్రవరి -1 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో వంద శాతం ఆక్యుపెన్సీ కి అనుమతి ఇచ్చింది. సినిమా పరిశ్రమ ఆనందానికి అంతు లేదు . జనవరి లో విడుదల అయిన ‘ క్రాక్‘, ‘ మాస్టర్’ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ” రెడ్ ” సినిమా సేఫ్ అయింది. అన్నిటికి మించి థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం సినిమా పరిశ్రమ కి ఆశని కలిగించింది . మెదటి వారం కావడం తో ప్రేక్షకులు థియేటర్స్ కి బాగా వస్తారని, ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా థియేటర్స్ కి నూరు శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీని మీద తెలుగు సినిమా రంగానికి చెందిన వారు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- థియేటర్లపై కర్చీఫ్ లు వేసే కిల్ రాజులెవరు?











