రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో 3డి లో నిర్మిస్తున్నారు. హిందీతో సహా.. అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ముంబై లో ఈ మధ్యే మొదలైన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.
ఇక తాజాగా బాలీవుడ్ టాల్ బ్యూటీ కృతి సనన్ ఆదిపురుష్ టీమ్ లో జాయిన్ అయింది. ఇందులో ఆమె సీతాదేవిగా నటించబోతోంది. అలాగే… లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీసింగ్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా సీతాదేవి కృతిసనన్ ను టీమ్ లోకి ఆహ్వానించారు మేకర్స్ . దర్శకుడు ఓం రౌత్ , హీరో ప్రభాస్ ఆమె తో ఫోటోలకు పోజులిచ్చి.. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నిన్న మొన్నటివరకూ సీతాదేవి పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొంది. అనుష్కశర్మ, అనుష్క శెట్టి, కీర్తిసురేశ్, కియారా అద్వానీ లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు కృతి సనన్ ఎంపికవడం విశేషం. ఆమె సీతా దేవిగా నటిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఆఖరికి ఇప్పుడు ఆమెనే సీతాదేవిగా నటించనుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక ఒక కొత్త ప్రయాణం మొదలవుతుందని, ఇందులో భాగం అయినందుకు తనకు చాలా గర్వంగా ఉందని అంటోంది కృతీ సనన్. మరి ఆదిపురుష్ లో సీతాదేవి గా కృతి ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.
Also Read : ‘ఆదిపురుష్’ షూటింగ్ కు రెడీ కానున్న ప్రభాస్
Welcoming @kritisanon and @mesunnysingh to the #Adipurush family.#Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 #TSeries pic.twitter.com/tEUWardxQZ
— BARaju (@baraju_SuperHit) March 12, 2021
A new journey begins.. ❤️
One of my most special ones.. overwhelmed to be a part of #Adipurush #Prabhas #SaifAliKhan @mesunnysingh @omraut #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/198BqAuoXT— Kriti Sanon (@kritisanon) March 12, 2021