ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. ఎక్కడో చోట ఏదో ఒక మూల ఎవరో ఒకరు రోజూ కరోనా బారిన పడుతునే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తరచుగా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టాల్ బ్యూటీ కృతిసనన్ కూడా చేరింది. ఆమెకి కరోనా పాజిటివ్ అనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సుందరి.. ప్రస్తుతం బాలీవుడ్ లో కథానాయికగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
కృతి ప్రస్తుతం రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తోన్న సినిమాలో అతడికి జోడీగా నటిస్తోంది. ఇటీవల చండీఘర్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. అందుకే ఆమెకు బాలీవుడ్ లో కరోనా సోకినట్టు భావిస్తున్నారు. అయితే ఈ వార్తపై అమ్మడి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి ఈ వార్తలో నిజానిజాలేంటటో చూడాలి.
Must Read ;- హిందీ సీరియల్ నటి కరోనాతో మృతి