ఇప్పుడు ప్రపంచంలో ట్రెండింగ్ విషయం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ అని చెప్పచ్చు. కరోనా వ్యాక్సిన్ అధికారకంగా విడుదల కాబోతుందనే తియ్యటి వార్త వినడానికి ప్రపంచదేశాధినేతల నుండి సామాన్య ప్రజల వరకు ఎదురుచూస్తున్నారు. కనీసం రెండు షాట్లు అవసరమని కొన్ని కంపెనీలు అంటున్నారు. ఇలాంటి ఇంజక్షన్లు లేకుండా టాబ్లెట్ ఉంటే బాగుంటుంది అనుకునే వారికో శుభవార్త. నోటి ద్వారా ఇచ్చే టాబ్లెట్ ని కూడా తయారుచేస్తున్నారు. అందులో మోల్న్ పిరావిర్ టాబ్లెట్ (MK-4482/EIDD-2801) అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
24 గంటల్లో కట్టడి చేస్తుంది
పరిశోధకుల వివరాల ప్రకారం, ఈ టాబ్లెట్ వేసుకున్న 24 గంటల్లోనే కరోనా మరొకరికి వ్యాప్తి చెందడం ఆగుతుంది. అంతేకాదు, శరీరంలో వైరల్ వృద్ధిని కూడా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున మూడో దశ ట్రైల్స్ జరుగుతున్న నేపథ్యంలో, రెండో దశ ఫలితాలు, మూడో దశ మధ్యంతర ఫలితాల ఆధారంగా దీని సామర్థ్యాన్ని ప్రకటించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా నోటి వ్యాక్సిన్ మోల్న్ పిరావిర్ టాబ్లెట్ నమోదు చేసుకుంది.
Must Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం
ఇదేం కొత్త టాబ్లెట్ కాదు
జార్జ్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ రిచర్డ్ ప్లెంపర్ టీమ్ ఈ టాబ్లెట్ ని ఇన్ ఫ్లూ ఎంజా వ్యాధిని కట్టిడి చేయడానికి కనిపెట్టారు. ఈ టాబ్లెట్ ని అమెరికాలోని రిర్జ్ బ్యాక్ బయోథెరప్ టిక్స్-మెర్క్ సంయుక్తంగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాబ్లెట్ ని కరోనా కట్టడి చేయడానికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో విజయవంతమైన ఫలితాలు అందిన ఈ టాబ్లెట్. తాజా మూడో దశలో ఫలితాల్లో మరింత అద్భుతాన్ని నమోదు చేసింది. కేవలం 24 గంటల్లో కరోనా వ్యాప్తని అడ్డుకుంటుందని పరిశోధకులు ప్రకటించడంతో ప్రపంచమంతా ఈ టాబ్లెట్ వైపు చూడడం మొదలుపెట్టింది.
కట్టిడి చేస్తుందా?
పరిశోధకుల స్టడీ ప్రకారం మొదటగా మనుషులను పోలిన అవయవాలు కలిగిన జంతువులపై నోటి ద్వారా ప్రయోగించారు. అవి అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలు అందించడంతో, మోతాదు మార్పులతో మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశారు. అవి కూడా మంచి ఫలితాలు అందించడంతో వారు అధికారకంగా స్టడీని వెల్లడి చేశారు. వ్యాక్సిన్ నేరుగా రక్తంలోకి ఎక్కించడం ద్వారా ఫలితాలు త్వరితగతిన అందుతాయి. కానీ, నోటి ద్వారా ఇచ్చే టాబ్లెట్, వ్యాక్సిన్ కంటే త్వరగా పనిచేయడం ఎంత వరకు సాధ్యమనే అనుమానాలు ఉన్నాయి. మరి వాటికి కంపెనీ సమాధానం ఏమిటో చూడాలి.
Must Read ;- ఏ టీకా ఎంత ధర పలుకుతుందో తెలుసా?