పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ వచ్చే సంవత్సరం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది రామాయణం స్పూర్తితో రూపొందనున్న మూవీ. ఈ భారీ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ రాముడు గెటప్ లో ఎలా ఉంటారో అనే ఆసక్తి ఏర్పడింది. అంతే కాకుండా.. ఎవరికి తోచినట్టుగా వాళ్లు ప్రభాస్ ని రాముడి గెటప్ లో ఊహించుకుంటూ స్టిల్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఆదిపురుష్ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే.. ఆదిపురుష్ రామాయణం అని.. రాముడుగా ప్రభాస్ నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి రావణుడు పాత్ర పై ఆసక్తి ఏర్పడింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ ని ఎంపిక చేసారని తెలిసి విమర్శలు వచ్చాయి. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా.. ప్రభాస్ కి దీటుగా.. యంగ్ హీరోని రావణుడు పాత్రకు ఎంపిక చేస్తే బాగుండేది. సైఫ్ ఆలీఖాన్ ను ఎంపిక చేయడం రాంగ్ ఛాయిస్ అంటున్నారు నెటిజన్లు. ఇక సీత పాత్రకు కృతిసనన్ ఎంపిక చేశారు. అటు బాలీవుడ్ లో కానీ.. ఇటు టాలీవుడ్ లో కానీ.. ఏమాత్రం సక్సస్ సాధించలేని.. ఏమాత్రం క్రేజ్ లేని కృతిసనన్ ను ఎంపిక చేయడం గురించి కూడా విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల సైఫ్ ఆలీఖాన్ ఆదిపురుష్ లో తన పాత్ర గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. రావణుడు సీతను అపహరించడం అనేది చెడుగా కాకుండా.. దాని వెనకున్న కారణాలను మానవీయ కోణంలో చూపించనున్నారని చెప్పారు. సైఫ్ ఆలీఖాన్ మాటలను బట్టి రావణుడుని మంచిగా చూపించనున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రావణుడు పాత్ర గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడు పాత్రకు సైఫ్ ఆలీఖాన్ ను తప్పించి వేరే వాళ్లను ఎంపిక చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి సైఫ్ ఆలీఖాన్ ఆదిపురుష్ లో రావణుడు పాత్ర ఎలా ఉండబోతుందో మీడియాకి చెప్పి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇలా ఆదిపురుష్ కి ఆది నుంచే కష్టాలే. మరి.. సైఫ్ ఆలీఖాను తప్పించాలనే డిమాండ్ పై డైరెక్టర్ ఓంరౌత్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Must Read ;- మరో సినిమా అనౌన్స్ చేయనున్న ప్రభాస్.. కన్ ఫ్యూజన్ లో ఫ్యాన్స్.











