బిగ్ బాస్ తెలుగు.. నాలుగో సీజన్ లో గ్లామర్ పరంగా అందరినీ బాగా ఆకట్టుకున్న క్యూట్ బ్యూటీ దివి. అందం, ఆకర్షణ రెండూ మెండుగా కలిగిన అమ్మడికి తనని తాను ఎలా ఎలివేట్ చేసుకోవాలో బాగా తెలుసు. అందుకే ఆ షోలో ఎప్పటికప్పుడు తాను గ్లామర్ గా ఫోకస్ అయ్యేందుకు బాగా తాపత్రయ పడింది. ఆ తపనే అమ్మడిని వెండితెరమీద అవకాశాల వరకూ తీసుకెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెకి అవకాశాలిస్తానన్నారంటే.. ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘క్యాబ్ స్టోరీస్’ మూవీ లో దివి నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె గ్లామర్ గా ఎలివేట్ అయిన తీరుకు జనం ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఆద్యంతం దివి తన అందాలతో మెస్మరేజ్ చేసిందని టాక్స్ వినిస్తున్నాయి. దాంతో మరిన్ని అవకాశాలు దివి దరిచేరనున్నాయి. అక్కినేని కాంపౌండ్ లోనూ, మెగా కాంపౌండ్ లోనూ ఆఫర్స్ అందిపుచ్చుకోనున్న దివి.. ఇంతలో మోస్ట్ డిజైరబుల్ విమన్ 2020 లో అగ్రపథాన నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక దివి అందాలు .. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. వాటి వల్లనే ఆమెకు ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. తాజాగా దివి ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ ఫిక్స్ కుర్రకారును నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి. రింగుల జుట్టు, వాలుకళ్ళతో ఆమె దివి నుంచి దిగిన వచ్చిన దేవకన్యలా ఎలివేట్ అవుతోంది. అలాగే.. అమ్మడి థై షో కూడా అదుర్స్ అనిపిస్తోంది. ఈ పిక్స్ కు బోలెడన్ని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.
Must Read ;-m ఇన్ స్టాలో రెచ్చగొడుతోన్న ‘డేంజరస్’ బ్యూటీ