వారి వ్యాఖ్యలను తీవ్రమైన చర్యగా పరిగణించిన హైకోర్టు వారిని వెతికి పట్టుకునే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన వ్యక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున వీడియో ద్వారా కాకుండా నేరుగా విచారణ చేయాలని సిబిఐకి సూచించింది. అంతేకాదు, ఈ కేసులో నిందితులు కొందరు విదేశాల్లో ఉండగా, వారిని కూడా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఫేస్ బుక్, ట్విట్టర్ కు లేఖలు
న్యాయ వ్యవస్థను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు పెట్టిన పోస్టులు అప్పట్లో బాగా హల్ చల్ చేశాయి. వాటిపై కోర్టు కేసు మొదలైందని తెలిసిన వెంటనే నిందితులు వాటిని తొలగించారు. కానీ, వాటికి సంబంధించిన డిజిటల్ ప్రింట్ అందుబాటులో ఉన్నందున వాటి ఆధారంగా మూలాలను వెతికి పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది సిబిఐ. విచారణలో భాగంగా సోషల్ మీడియా సంస్థలు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లకు లేఖల ద్వారా సమాచారం పంపి, వారి నుండి ఈ పోస్ట్ లకు సంబంధించిన అసలైన ఐపి అడ్రస్ లను కనుక్కునే పనిలో పడ్డారు.
Musr Read ;- అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు సీబీఐకి ఇస్తారా?
తప్పించుకోలేరు
ఈ కేసు నమోదైన వ్యక్తుల్లో కొందరు విదేశాల్లో ఉన్నందున వారిని విచారించడం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, విదేశాల్లో ఉన్నంత మాత్రాన తప్పించుకోవచ్చు అనకుంటే మాత్రం పొరపాటే. దాదాపు 17 మందిపై కేసులు నమోదు చేయగా అందులో నలుగురు కిషోర్ రెడ్డి, మణి అన్నపు రెడ్డి, లింగా రెడ్డి, రాజశేఖర రెడ్డి విదేశాల్లో ఉన్నారు. వారిని సైతం నోటీసుల ద్వారా భారత్ కి రప్పించడానికి విచారణ సంస్థ ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి సాక్ష్యాలు అందితే, వారిని భారత్ కి రప్పించడం సులభమవుతుందనే ఆలోచనలో ఉంది సిబిఐ.
వివి లక్ష్మీ నారాయణ విచారణ
రెండు రోజులు క్రితం సీబీఐ లాయర్ వివి లక్ష్మీ నారాయణ ను విచారించింది. దాదాపు గంటపాటు కొనసాగిన సిబిఐ విచారణలో తన వద్దనున్న సమాచారాన్ని, పేపర్ ఆధారాల్ని, వీడియోలను సిబిఐకి అందించారు వివి లక్ష్మీ నారాయణ. ఆ వివరాల్లో దాదాపు 107 మంది పెట్టిన అభ్యంతరకర పోస్టుల గురించిన సమాచారం అందించారు. ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసిన వారి విచారణ పూర్తి కాగానే, వివి లక్ష్మీ నారాయణ అందిన సమాచారం పరిశీలించి, అవసరమైతే కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వ్యక్తిగతమా… వ్యవస్థీకృతమా…
సిబిఐ ఈ పోస్టింగ్ ల వెనక కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను భంగపరచడానికి చేసిన కుట్ర లేక వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలా అనే దానిపై కూడా సిబిఐ దృష్టి సారించింది. తీర్పు అనంతరం వ్యక్తిగతంగా తమ నిరసన వ్యక్తం చేయాలనే ఉద్ధేశమా… లేక ఇది వ్యవస్థగా ఏర్పడి ఉద్ధేశపూర్వకంగా కోర్టులు, న్యాయ మూర్తుల ప్రతిష్ఠ మసకపరచడానికి చేసిన ప్రయత్నమా అనే విషయంలో కూడా ఒక స్పష్టత కోసం ప్రయత్నిస్తుంది సిబిఐ. దీని కోసం ఐపి అడ్రస్ లు అందగానే పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తులకు మధ్య ఏమన్నా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరిపితే, ఈ పోస్టింగ్ ల వెనక అసలు కారణం బయటపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read ;- సోషల్ మీడియా నే(పో)రగాళ్ళపై సిబి‘ఐ’